మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిళి మండలం బూరుగుల గ్రామంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.