కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోవద్దు: ఎర్రబెల్లి
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సర్వీ (పోలీస్) వెంకన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ మోసపోవద్దని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.