పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు

అనంతపురం: రొళ్ల మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. మండలంలోని చెర్లోపల్లి గ్రామ సరిహద్దులలో మడకశిర రూరల్ సీఐ రాజ్ కుమార్ రొళ్ల ఎస్ఐ వీరాంజనేయులు ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 మంది జూదరులను పట్టుకొని వారి నుంచి రూ.72,880 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.