పోస్టర్లు అతికించకండి: కమిషనర్

KRNL: కర్నూలులోని కూడళ్లు, డివైడర్లు, గోడలపై బ్యానర్లు, వాల్ పోస్టర్లు, జెండాలు అతికించడం చట్టరీత్యా నేరమని మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు కర్నూలు నగరపాలక సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.