గర్భగుడి పునః నిర్మాణానికి శ్రీకారం

గర్భగుడి పునః నిర్మాణానికి శ్రీకారం

NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో గర్భగుడి పునః నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నవగ్రహాల పూజలు, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ దంపతులు, 14వ వార్డు సందాపురం సువర్ణ రవికుమార్, ముద్దం భారతి రాము, కురువ మల్లమ్మ సాయిబన్న పాల్గొన్నారు.