రాత్రికి రాత్రి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం
PDPL: గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 48 దేవాలయాల కూల్చివేతతో రాజకీయ వేడి పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే కూల్చారని బీజేపీ నేత సంధ్యారాణి ఆరోపించారు. దీనిపై ఎంపీ వంశీకృష్ణ సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. బండి సంజయ్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని, రాత్రికి రాత్రి నిర్మాణ పనులు ప్రారంభించారు.