VIDEO: స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య ధోరణిని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం పేర్కొనడం దారుణమన్నారు. యూనియన్ నాయకులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.