నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు

కృష్ణా: జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు బాపులపాడు (M) వేలేరు ప్రిన్సిపల్ డి. ఏదునందన తెలిపారు. అర్హులైన ఆసక్తిగల విద్యార్థులు ఆగస్టు 13వ తేదీ లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ JNVఅధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని వెల్లడించారు.