కార్మికులకు పని గంటలు తగ్గించాలి: వినోద్ కుమార్

కార్మికులకు పని గంటలు తగ్గించాలి:  వినోద్ కుమార్

సత్యసాయి: హిందూపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు పని గంటలను పెంచి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. 8 గంటల పనివిధానాన్ని కొనసాగించాలని డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతి పత్రం అందజేశారు.