పలమనేరులో కనకదాసు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
CTR: పలమనేరు టీడీపీ కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కనకదాసు జయంతిని అధికారికంగా గుర్తించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం కనకదాసు చూపిన మార్గంలో అందరూ పయనించాలని కోరారు.