గుణుపూర్ ప్యాసింజర్ రైలుకు సాంకేతిక లోపం
SKLM: గుణుపూర్ ప్యాసింజర్ రైలుకు గురువారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. వజ్రపుత్తూరు మండలం రౌతుపురం రైల్వే స్టేషన్ వద్ద సాంకేతిక లోపం ఏర్పడడంతో కాసేపు నిలిచిపోయింది. రైల్వే గార్డ్ ట్రైన్ ఇంజన్‌తో పాటు, కంపార్ట్మెంట్‌లు కింద ఉన్న మిషన్లను పరిశీలించారు. గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఈప్యాసింజర్ లు ఈరైలులో ఉన్నప్రయాణికులు ఒక్కసారిగా ఆత్రుత చెందారు.