విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
SKLM: ఆమదాలవలస మండలం కొరపాం పాఠశాలను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆకస్మికంగా బుధవారం సందర్శించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.