అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో రూ. 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ. 1.60 కోట్లు, ఉపాధి హామీలు రూ. 40 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నామని సర్పంచ్ దిడ్ల అలకనంద పేర్కొన్నారు.