పుంగనూరులో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

పుంగనూరులో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

CTR: పుంగనూరులోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి MRO రాము, MPD అప్పాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తర్వాత వ్యాసరచన, వకృత్వపు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.