రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

NDL: కొత్తపల్లి మండలంలో గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి, మిరప, ఇతర పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి వెంకట శివుడు యాదవ్ మంగళవారం తెలిపారు. ఈ విషయంపై ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భీముడు, ఓబులేసు, లింగయ్య, లింగస్వామి, బాలు, తదితరులు పాల్గొన్నారు.