రాష్ట్రంలోనే మొదటి స్థానం.. పరిటాల సునీత సన్మానం
ATP: కురుగుంట అంబేద్కర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదువుతూ అనురాధ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పరీక్షల్లో వెయ్యికి 989 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన శోధనపల్లి వాసి అనురాధను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. అనంతపురం తన క్యాంపు కార్యాలయంలో ఆమెను ఘనంగా సన్మానించి రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు.