VIDEO: అల్లూరికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులలో అల్లూరి సీతారామరాజు ఒకరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.