VIDEO: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి సెగ
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేసవి ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కథలాపూర్లో 42.8 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపురంలో 42.5 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో 42.4 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యయి.