నేడు కనిగిరిలో పర్యటించనున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం: కనిగిరిలో జిల్లా కలెక్టర్ రాజాబాబు గురువారం పర్యటించనున్నారు. పట్టణంలోని షాదీ ఖానాలో ఉదయం 10 గంటలకు డివిజన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కలెక్టర్ సమీక్ష నేపథ్యంలో డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొనాలని కనిగిరి డీడీఓ శ్రీనివాస్ రెడ్డి కోరారు.