'పేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి'
KMR: రామారెడ్డి గ్రామ సేవకుడిగా పని చేస్తానని సర్పంచ్ అభ్యర్థి తుపాకుల రాజేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం రామారెడ్డిలో ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నానని, గ్రామ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.