పన్నుల వసూళ్లలో రికార్డు సాధించిన ఖమ్మం
KMM: ఖమ్మం జిల్లాలోని GPలు పన్నుల వసూళ్లలో రికార్డు స్థాయి పురోగతి సాధించాయి. మండలాల వారీగా చూస్తే 94 % వసూళ్లతో కొణిజర్ల అగ్రస్థానంలో నిలవగా, 87 %తో చింతకాని మండలం వెనుకబడింది. నిర్దేశిత లక్ష్యం రూ. 15.34 కోట్లు కాగా, మార్చి 31 నాటికి రూ. 13.87 కోట్లు (90%) వసూలు కావడం విశేషం. అధికారుల సమన్వయం, పాలకవర్గాల చొరవతో ఈ విజయం సాధ్యమైంది.