ఘనంగా వనదుర్గ పెద్దమ్మ బోనాలు
KMR: దోమకొండ మండల కేంద్రంలోని వనదుర్గ పెద్దమ్మ దేవస్థానంలో 28వ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బోనాల కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా దోమకొండలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.