ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టొద్దు: కలెక్టర్

ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టొద్దు: కలెక్టర్

GDWL: సామాజిక బాధ్యతతో కూడిన ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. ​జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా ఇందిరమ్మ గృహాల సమస్యలు వచ్చాయన్నారు.