సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జడ్జి

సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జడ్జి

SRD: మండల కేంద్రమైన కంది పరిధిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి సౌజన్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఉన్న వంటగది, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా అవసరం ఉంటే న్యాయ సహాయం ఉచితంగా అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు.