గతంతో పోల్చుకుంటే తగ్గిన నోటా ఓట్లు

MHBD: మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గతంలో కంటే తక్కువ మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో 14,082 ఓట్లు నోటాకు వేయగా.. ప్రస్తుతం 6,591 మంది మాత్రమే నోటాకు ఓటు వేశారు. అటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోనూ గతంలో కంటే ఈసారి నోటాకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో వరంగల్ ప్రజలు కాంగ్రెస్‌కు జై కొట్టారు.