రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్న

రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి అచ్చెన్న

AP: రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షలు జరుగుతున్నాయ‌ని అన్నారు.