శభాష్.. 5 బ్యాంకు ఉద్యోగాలు

JGL: కొండాపూర్‌కు చెందిన ఇట్టే వీరేశం, విజయలక్ష్మి కుమార్తె వైష్ణవి ఏకంగా 5 బ్యాంకుల్లో ఉద్యోగాలను సాధించింది. పేద కుటుంబానికి చెందిన వైష్ణవి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం ఎంతో గర్వకారణమని మండల ప్రజలు ఆమెను అభినందిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్మూర్ బ్రాంచ్‌లో బ్యాంక్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది.