'జిల్లాలో పదవ తరగతి పరీక్షకు 12 మంది గైర్హాజరు'
WNP: జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలలో పదవ తరగతి జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 7219 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 7209 మంది, పరీక్షరాయగా పదిమంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా 5 మంది ప్రైవేట్ విద్యార్థులకుగాను 3 మంది పరీక్షలు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని తెలిపారు. ఎటువంటి అవాంతరలు తలెత్తలేదన్నారు.