సత్తుపల్లిలో వింత దొంగలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రింగు సెంటర్ వద్ద రోడ్డు పక్కన పెట్టిన పండ్ల బండి నుండి రాత్రి సమయంలో దొంగలు పండ్లు ఎత్తుకుపోతున్నారు. దీనితో సత్తుపల్లిలో చిరు వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. పండ్లు ఎత్తుకెళ్లి దృశ్యం అక్కడ ఉన్న ఒక షాపు సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ ఘటనపై చిరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.