పోలీసులు అనుమతించే వరకు కదలను: కేతిరెడ్డి పెద్దారెడ్డి

పోలీసులు అనుమతించే వరకు కదలను: కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దాడ్డి, తాను ఎలాంటి ఫ్యాక్షన్ చేయలేదని, అయినప్పటికీ పోలీసులు తనను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సోమవారం ఆరోపించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కావాలనే ఈ పరిస్థితిని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు అనుమతించే వరకు కదలనని ఆయన స్పష్టం చేశారు.