మంత్రిని కలిసిన న్యాయవాదుల నూతన కార్యవర్గం
NDL: నంద్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను సోమవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్‌తో పాటు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు.