ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MDK: హవేలిఘనపూర్ మండలం తొగిటలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సిద్దిరాంరెడ్డి, GPO గణేష్, శశికాంత్, సత్యం గౌడ్, బలరాం రెడ్డి,రైతులు పాల్గొన్నారు.