42 రకాల వంటకాలతో గణేశుడికి నైవేద్యం

42 రకాల వంటకాలతో గణేశుడికి నైవేద్యం

KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుడు సంజీవరావు శర్మ పర్యవేక్షణలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మంగళవారం గణపతికి 42 రకాల వంటకాలతో ప్రసాదం సమర్పించారు. మహిళలు ప్రతి రోజు ఒక్కో వినూత్న కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక శోభ తీసుకొస్తున్నారు.