నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన వివరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలో పద్మనాయక వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రస్థాయి అండర్ 18 వాలీబాల్ పోటీలను ప్రారంభిస్తారు.