కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి
VKB: బంట్వారం మండల కేంద్రంలో వీధి కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి చెందాయి. మండల కేంద్రానికి చెందిన పశువుల కాపరి బండమీది రాజు తన మేకలను అడవికి మేతకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి వీధి కుక్కలు దాడి చేయడంతో మేక పిల్లలు చనిపోయి కనిపించాయి. తీవ్రంగా నష్టపోయిన రాజు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.