జిల్లా కలెక్టర్‌ని కలిసిన నూతన ఎస్పీ సునీత
వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీత ఐపీఎస్, మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పాత్ర కీలకమని అన్నారు.