VIDEO: 'యోగా చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది'
KNR: లయన్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అస్త్ర కన్వెన్షన్‌లో మధుమేహంపై అవగాహన కోసం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై యోగా చేశారు. యోగా చేయడం వల్ల శరీరం ఉత్తేజంగా పనిచేస్తుందని, అనేక రోగాలను నయం చేయడానికి దోహదపడుతుందని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రాధాకృష్ణ పాల్గొన్నారు.