చెట్టు కూలి కారు ధ్వంసం

చెట్టు కూలి కారు ధ్వంసం

MDCL: ఈదురు గాలులవల్ల కర్మాన్ ఘాట్‌లో భారీ చెట్టు కూలి పార్క్ చేసిన కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసం అయింది. చెట్టు కూలిన సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టును తొలగించారు. అయితే ప్రమాదాల నివారణకు పాత చెట్లను ముందుగానే తొలగించాలని స్థానికులు కోరారు.