సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

SRPT: సహకార సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతగిరి మండలం గోండ్రియాల సొసైటీ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బుర్ర నరసింహారెడ్డిని ఆమె సన్మానించారు. సహకార సంఘం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.