'రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది'
SRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ నిన్న సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతూ, ప్రయాణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు వాహనాలు తనిఖీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.