VIDEO: చందుర్తి మండల కేంద్రంలో సంబరాలు

SRCL: ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడి చేసి ధ్వంసం చేసిన నేపథ్యంలో, బుధవారం చందుర్తి మండల కేంద్రంలో పౌరులు సంబరాలు జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై దాడి చేసి విజయం సాధించడంతో టపాసులు పేల్చి, స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరిపారు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారని భారత పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.