ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలి - జేసీ

VSP: ప్రభుత్వ ఉద్యోగులు కర్మయోగి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నైపుణ్యాన్నిపెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సూచించారు. విజయవాడ నుండి జిల్లా అధికారులకు iGOT కర్మయోగి పోర్టల్‌పై ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చారు. ఈ పోర్టల్ ఉద్యోగుల వృత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సాంకేతిక మార్పులకు అనుగుణంగా పనిచేయడానికి ఉద్దేశించబడింది అని తెలిపారు.