జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ మంత్రి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీమంత్రి సురేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకోవాలని, ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.