నాలుగు రైస్ మిల్లులపై కేసు నమోదు

వరంగల్: జిల్లాలో నాలుగు రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సంగెం మండలంలోని శ్రీ లక్ష్మీ, నర్సంపేటలోని వీరభద్ర, గీసిగొండలోని జయ, చెన్నారావుపేటలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లులపై ప్రభుత్వానికి సీఎంఆర్ పెట్టకుండా ఆలస్యం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు జిల్లా మేనేజర్ సంధ్యారాణి తెలిపారు.