పెరుగుతున్న కూరగాయల ధరలు

పెరుగుతున్న కూరగాయల ధరలు

కోనసీమ: జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో కూరగాయలు దిగుబడి తగ్గుతుంది. దీని వలన కూరగాయలు ధరలు అమాంతం ఒక్కసారిగా పెరిగాయి. అమలాపురం మార్కెట్‌లో కూరగాయల ధరలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలియజేశారు. కిలోలలో ధరలు చూసుకుంటే చిక్కుడు కాయ రూ.80, అల్లం రూ.80, బెండకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.40, కాకరకాయ రూ.40లుగా అమ్ముతున్నారు.