రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కృష్ణాపురంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. యువత అపోహలు వీడి, రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.