VIDEO: నిండిన చెరువు.. రైతుల్లో ఆనందం
PPM: రాజంపేట పట్టణానికి కీలకమైన పోలి చెరువు దాదాపు నిండిపోవడంతో శుక్రవారం స్థానికుల్లో ఆనందం నెలకొంది. ఈ చెరువు ద్వారా 2000 ఎకరాల ఆయకట్టు, పెనగలూరు మండలం లోని పలు గ్రామాలకు భూగర్భజలాలు సమృద్ధిగా లభిస్తాయి. చెరువు నీరు ఎక్కువకాలం నిల్వ ఉండటం వల్ల రాజంపేటలో వేసవికాలంలో కూడా నీటి సమస్య రాదు. నిండిన తరువాత నీటిని చక్రాలమడుగు వైపు మళ్లిస్తారు.