ఉదయగిరిలో పోషణ్ పక్వాడా కార్యక్రమం

ఉదయగిరిలో పోషణ్ పక్వాడా కార్యక్రమం

NLR: ఉదయగిరి పట్టణంలోని HR ఆంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు సూపర్ వైజర్ షాను ఆరోగ్య సూచనలు చేశారు. సంప్రదాయ వంటల వల్ల ఆరోగ్యం సొంతమవుతుందని తెలిపారు. అనంతరం వంటకాల తయారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.