VIDEO: మహిళ అకౌంట్ నుంచి డబ్బులు మాయం

VIDEO: మహిళ అకౌంట్ నుంచి డబ్బులు మాయం

KDP: రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ రహమతున్ అనే మహిళ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తుండగా, పాత బస్టాండ్ వద్ద ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసి ఏటీఎం కార్డును పోగొట్టుకున్నారు. ఆ కార్డు దొరకడంతో, పిన్ నంబర్ ఆధారంగా అకౌంట్లోని రూ. 30 వేలను పట్టణంలోని వివిధ ఏటీఎంల నుంచి ఒక వ్యక్తి డ్రా చేశాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.