మచిలీపట్నంలో మంత్రి బైక్ ర్యాలీ

కృష్ణా: మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఆదివారం కల్లుగీత కార్మికుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల హామీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ ర్యాలీలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.